భారీ వర్షాలు.. జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ..!
KMM: రాష్ట్రంలో నేడు పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని IMDA హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఖమ్మంకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వర్షాలు దృష్ట్యా ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే రైతులు తమ పంటలను కోయడం వంటి పనులను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.