ఎస్సీ, ఎస్టీ కేసులు పరిష్కరించాలని ఎస్పీకి వినతి
GNTR: తెనాలికి చెందిన అంబేడ్కర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ప్రభాకరరావు బుధవారం ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. యాక్ట్ (ACT) ప్రతినిధి లెనిన్ వర్మతో కలిసి గుంటూరులో ఎస్పీని కలిసిన ప్రభాకరరావు పలు అంశాలపై చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టినందుకు ఎస్పీకి అభినందనలు తెలియజేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎస్సీ,ఎస్టీ కేసులను పరిష్కరించాలన్నారు.