తెలుగుదేశం పార్టీలో చేరిన 30 కుటుంబాలు

తెలుగుదేశం పార్టీలో చేరిన 30 కుటుంబాలు

VZM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన దక్షతను మెచ్చి 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఆదివారం విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గంట్యాడ మండలంలోని కొర్లాం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.