శ్రీ ఈరన్న స్వామిని దర్శించుకున్న నరవ దంపతులు

KRNL: కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహా ఈరన్నస్వామిని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. నరవ దంపతులు శ్రీ ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.