VIDEO: ప్రధానిపై అనుచిత పోస్టు.. యువకుడు అరెస్ట్

కోనసీమ: మామిడికుదురు మండలం PS పరిధిలో సోషల్ మీడియాలో PM మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI భీమరాజు బుధవారం వెల్లడించారు. ప్రధానిపై ఫేస్ బుక్‌లో అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కర్రి మోహన కనక దుర్గారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. సోషల్ మీడియా పోస్టుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలన్నారు.