ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 20 లక్షల నజరానా

ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 20 లక్షల నజరానా

KNR: వచ్చే నెల రెండో విడుతలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీల అభివృద్ధికి రూ. 20 లక్షలు ప్రోత్సాహంగా అందజేస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. బుధవారం ఎల్ఎండీ కాలనీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.