'అందెశ్రీ మరణం తీరని లోటు'
GDWL: ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణం పట్ల గద్వాల పట్టణం శోకసంద్రంలో మునిగింది. సోమవారం సాయంత్రం కృష్ణవేణి చౌక్‌లో ప్రజాసంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అందెశ్రీ జీవితాంతం పాటించిన నిక్కచ్చితనాన్ని, అక్షరాన్ని అమ్ముకోకపోవడం వంటి గొప్ప సుగుణాలను కొనియాడారు.