విశాఖకు చేరుకున్న భారీ LPG నౌక
AP: 47 వేల టన్నుల LPG లోడుతో భారీ నౌక 'Pine Gas' ట్యాంకర్ విశాఖ పోర్టుకు చేరుకుంది. ధామ్రా (ఒడిశా)కు వెళ్లాల్సిన ఈ నౌకను తెలుగు రాష్ట్రాల్లో LPG అవసరాలను దృష్టిలో పెట్టుకొని విశాఖకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ షిప్ వచ్చింది. అందులోని గ్యాస్‌ను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. నౌక రాకతో 2 రాష్ట్రాల ప్రజల వంట గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.