VIDEO: ‘లడ్డూ కల్తీపై జగన్ క్షమాపణ చెప్పాలి’
KKD: వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ కల్తీ ఘటనపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భక్తులకు క్షమాపణలు చెప్పాలని సామర్లకోట రూరల్ టీడీపీ అధ్యక్షుడు ముసిరెడ్డి శ్రీరాములు డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి మాట్లాడుతూ.. కల్తీ జరిగినట్లు ఆధారాలు ఉన్నా, వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వైసీపీ అరాచకాలపై పోరాటం తప్పదని హెచ్చరించారు.