వసతి గృహానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
హనుమకొండలో ముదిరాజ్ విద్యార్థుల వసతి గృహం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, త్వరలోనే స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, ప్రభాకర్, రాజేశ్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.