'GHMC వార్డుల పునర్విభజనకు తొందరెందుకు?'
TG: HYD GHMC వార్డుల పునర్విభజన ముసాయిదాపై BRS అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొత్త డివిజన్ల ఏర్పాటు, వార్డుల విభజన ముసాయిదాలో లోపాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో పలువురు పార్టీ నేతలు GHMC కార్యాలయానికి వెళ్లి.. కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. డివిజన్ల పునర్విభజనలో తప్పిదాలను సరి చేయాలని విజ్ఞప్తి చేశారు.