కిషోరి వికాసం అవగాహన కార్యక్రమం

ప్రకాశం: కనిగిరి మండలం చీర్లదిన్నె ఎస్సీ కాలనీలో కిషోర్ వికాసం కార్యక్రమంలో భాగంగా కిశోర బాలికలతో సమావేశం, ర్యాలీని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎంవిఎస్ పార్వతీ మంగళవారం చేపట్టారు. రుతుక్రమం ద్వారా రక్తహీనత కలుగుతుందని పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత ను నివారించవచ్చని ఆమె తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పై కిశోర బాలికలకు అవగాహన కల్పించారు.