ప్రజావాణిలో 167 ఫిర్యాదులు
SRCL: ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి 167 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ఒక్క ఫిర్యాదును కూడా పెండింగ్‌లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.