ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ

ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ

ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. BSP వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని ఆయన కోరారు. సమాజంలోని అణగారిన వర్గాల సాధికారతకు, సామాజిక న్యాయం కోసం కాన్షీరామ్ చేసిన అసమాన కృషికి ఈ గుర్తింపు దక్కాలని పేర్కొన్నారు. బహుజన ఉద్యమ నిర్మాతకు ఇచ్చే గౌరవం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని రాహుల్ వివరించారు.