VIDEO: 'పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నులే ఎక్కువగా ఉన్నాయి'
ASF: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కంటే రాష్ట్ర పన్నులే ఎక్కువగా ఉన్నాయని సిర్పూర్ MLA హరీష్ బాబు సోమవారం అసెంబ్లీలో విమర్శించారు. 2014లో 28%గా ఉన్న వ్యాట్ ప్రస్తుతం 35%కి పెరిగిందని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల్లోనూ కేంద్రం ధరలు తగ్గించిందని, ఆయిల్ సంస్థలకు రోజుకు రూ. 2,400 కోట్ల నష్టం వాటిల్లుతున్నా సామాన్యుల కోసం నిర్ణయం తీసుకుందన్నారు.