రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
PPM: ఎరువుల పంపిణీలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అదనపు ధరలు వసూలు చేసినా లేదా ఇతర ఉత్పత్తులు బలవంతంగా విక్రయించినా డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రైతుపై రూపాయి కూడా అదనపు భారం పడకూడదని స్పష్టం చేశారు. ఎరువుల సరఫరా, స్టాక్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.