మల్లూరు బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు

మల్లూరు బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు

MLG: మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏటూరునాగారం నుంచి మల్లూరుకు అదనపు బస్సులు నడపనున్నట్లు వరంగల్-2 డిపో మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఈనెల 8 నుంచి 10 వరకు 40 నిమిషాలకు, 12, 16వ తేదీల్లో ప్రతి 20 నిమిషాలకు బస్సును నడుపుతామని పేర్కొన్నారు. ఉ.7 గంటలకు బస్టాండ్ నుంచి బస్సులు బయల్దేరుతాయని తెలిపారు.