రేపు నిడదవోలు రానున్న Dy.CM పవన్ కళ్యాణ్
E.G: నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలకు Dy. CM పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. గణపతి సెంటర్‌లో జరిగే ఈ వేడుకకు పవన్ వస్తారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.