నేటి నుంచి భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి డిపో నుంచి మార్చి 27న భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ మాధవ్ తెలిపారు. ప్రతి గంటకు ఒక బస్సు నడుపుతామని, ముందస్తు రిజర్వేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.