సొంతింటి కల.. మరో ఆరు రోజులే గడువు
గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు మరో 6 రోజులే గడువుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 3.47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లను కేటాయించనున్నారు.