ఘనంగా రంగనాయక స్వామి కళ్యాణం

ఘనంగా రంగనాయక స్వామి కళ్యాణం

మేడ్చల్: ఘట్కేసర్ పరిధిలోని యమ్నంపేటలో శ్రీ రంగ నాయక స్వామి దేవాలయంలో కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జిల్లా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ వజ్రేష్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి కటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. భక్తులు సైతం భారీ ఎత్తున తరలిరావడంతో ఉత్సవం విజయవంతమైంది.