కడపలో 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'
కడపలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలను గౌరవిస్తూ, వారిని సన్మానించారు. అనంతరం మహిళల ఆరోగ్యం, సాధికారత, స్వాభిమానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ వంగళ శశిభూషణ్, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మ, జిల్లా నేతలు పాల్గొన్నారు.