VIDEO: అమలాపురంలో చోరీ.. సీసీటీవీలో రికార్డు

VIDEO: అమలాపురంలో చోరీ.. సీసీటీవీలో రికార్డు

కోనసీమ: అమలాపురంలో ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి వృద్ధున్ని మోసగించి రూ.20 వేలు నగదును దొంగలించారు. కొంకాపల్లికి చెందిన సత్యనారాయణ బ్యాంకు నుంచి రూ.20వేలు నగదు డ్రా చేసుకొని బుధవారం ఇంటికి వచ్చాడు. అతనిని వెంబడించిన ఇద్దరు యువకులు తమ బైకు ఆగిపోయిందని నమ్మించి నగదును దొంగలించి పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.