BREAKING: 8 మంది మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొనడంతో 8 మంది మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కటిహార్ జిల్లా పోతియా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.