VIDEO: బిర్యానీలో దర్శనమిచ్చిన బీడీ
హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని ఓ కేఫ్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో సగం కాలిన బీడీ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీనిపై హోటల్ సిబ్బందిని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.