అలర్ట్.. రేపు విద్యుత్ నిలిపివేత

అలర్ట్.. రేపు విద్యుత్ నిలిపివేత

SRPT: సూర్యాపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. తీగలకు అడ్డుగా ఉన్న చెట్టుకొమ్మల తొలగింపు నేపథ్యంలో ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని ఏఈ సురేష్ తెలిపారు. శ్రీనివాస కాలనీ, డీ మార్ట్ పరిసరాలు, జమ్మిగడ్డ, ఏపూర్ బస్టాండ్, వీటీ రోడ్ తదితర ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు.