వైసీపీ కార్యకర్తను పరామర్శించిన ఉషశ్రీ చరణ్

సత్యసాయి: సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో వైసీపీ కార్యకర్త దాదాపీర్‌ను శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.