ఫిరంగిపురంలో ‘వందేమాతరం’ వేడుకలు
GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో ఇవాళ వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గేయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం గీతం ఆవిర్భావ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం భారతజాతి పితామహులకు పుష్పాంజలి ఘటించి, వందేమాతర గీతాన్ని ఆలపించి ఘనంగా నివాళులర్పించారు.