'దళారులను నమ్మి మోసపోవద్దు'

'దళారులను నమ్మి మోసపోవద్దు'

KMM : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని మున్సిపల్‌ ఛైర్మన్‌ ధరావత్‌ మోహన్‌ నాయక్‌ సూచించారు. శనివారం కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.