ఎస్‌యూలో PHD ప్రవేశ ఫలితాలు విడుదల
KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ ప్రవేశ ఫలితాలను ఎస్‌యూ ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ పరిపాలనా భవనంలో మంగళవారం విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాన్ని పరిశోధనలో కూడా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. అత్యుత్తమ పరిశోదనలు, పేటెంట్స్‌తో విద్యారంగంలో మేలైన విశ్వవిద్యాలయంగా నిలుపుతామని పేర్కొన్నారు.