ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని నిరసన

NTR: విజయవాడలో 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనరేట్ వద్ద సర్పంచులు మంగళవారం ఆందోళనకు దిగారు. నిరసన చేస్తున్నవారికి సర్దిచెప్పేందుకు ఛాంబర్ ఆఫ్ పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి ప్రతాప్రెడ్డి యత్నించారు. సెప్టెంబర్ నెలాఖరులోపూ నిధులు విడుదల చేస్తామని ప్రతాప్ రెడ్డి వివరించారు.