అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ

అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని 31వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. వీధుల్లో చెత్త పేరుకుపోయి మురుగు కంపు వెదజల్లుతోంది. స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. చుట్టుపక్కల నుంచి వ్యర్థాలను తెచ్చి ఇక్కడ వేసి వెళ్ళిపోతున్నారని తెలిపారు. పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఇలాగే కొనసాగితే రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.