ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఆగ్రహం

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఆగ్రహం

NRPT: దమగాన్పూర్ గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకట్రాములు తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా పనుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామసభలో చర్చించిన అనంతరం ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఎంపీడీవో రామన్నకు గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు.