VIDEO: తహసీల్దార్ కార్యాలయంలో రైతు ఆవేదన
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఓ రైతు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామానికి చెందిన రైతు తల్లడ చొక్కయ్య వెంపటి గ్రామ శివారులో తన వ్యవసాయ పొలంలో బోరు వేయించాడు. అయితే, దాని పక్కనే మరొక రైతు బోరు వేయడంతో తన బోరు ఎండిపోయింది. తనకు న్యాయం చేయాలని సదరు రైతు విలపిస్తున్నారు.