పాపికొండలు అభయారణ్యంలో వైల్డ్ డాగ్స్

ELR: పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) సంచరిస్తున్నాయి. అడవి పందిని ఈ వైల్డ్ డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. పెద్ద పులలను సైతం ఇవి ఎదిరించగలవు. ఇవి ఊర కుక్కల కంటే పెద్దవిగా, తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.