అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సర్పంచ్
JGL: ఎండపల్లి మండలం ఉండేడా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ మమత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్‌తో మాట్లాడి ప్రభుత్వం నుంచి వచ్చే గుడ్లు, బాలామృతం సహా అన్ని పోషకాహార పదార్థాలను ప్రతి బాలింతకు, పిల్లలకు సమయానికి అందించాలని సూచించారు. కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. ఉప సర్పంచ్ రవి, వార్డ్ సభ్యులు ఉన్నారు.