షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
KMM: కల్లూరు మండలం రఘునాధగూడెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం ముళ్లపాటి శ్రీనివాసరావు ఇల్లు దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇంటిలోని విలువైన వస్తువులు కాలిపోయినట్లు పేర్కొన్నారు. సమాచారం అంతుకున్న కల్లూరు ఆస్ఐ సుజాత సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, దాదాపు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు నిర్ధారించారు.