అగ్ని ప్రమాదానికి దగ్ధమైన పురిల్లు

అగ్ని ప్రమాదానికి దగ్ధమైన పురిల్లు

SKLM: కొత్తూరులోని కొత్తపేట కాలనీలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కోగాన పద్మ అనే మహిళకు చెందిన పురిళ్లు దగ్ధమైంది. ఆమె కష్టపడి దాచుకున్న సుమారు రూ.లక్ష నగదు, తులంన్నర బంగారు ఆభరణాలతో పాటు తిండి, బట్టలు, వంట పాత్రలు పూర్తిగా కాలిపోయాయని బాధితురాలు రోదించింది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియలేదని స్థానికులు తెలిపారు.