సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు

సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం రోగులతో కిటకిటలాడుతుంది. వర్షాకాలం కావడంతో ప్రజలు సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రజలు ఆసుపత్రికి క్యూ కట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కాచిన నీళ్లు తాగాలని సూచించారు. వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలన్నారు.