ఎరువులు కోసం రైతులు ఆందోళన

ఎరువులు కోసం రైతులు ఆందోళన

శ్రీకాకుళం: ఎల్.ఎన్.పేట మండలం తురకపేట రైతు సేవా కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. టోకెన్లు పొందిన రైతులకే ఎరువులు పంపిణీ చేశారు. ఉదయం నుంచి వేచి ఉన్న రైతులకి టోకెన్లు లేని కారణంగా ఎరువులు ఇవ్వకపోవడంతో వ్యవసాయ శాఖ సిబ్బందికి రైతులు నిలదీశారు. పరిస్థితి తెలుసుకున్న సరుబుజ్జిలి ఎస్సై హైమావతి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి టోకెన్లు రాయించారు.