'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

E.G: చాగల్లు ప్రభుత్వ ఆసుపత్రిని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై అరా తీశారు. ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆసుపత్రిలోని సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.