చిరుత పులిని చంపిన వ్యక్తుల రిమాండ్

చిరుత పులిని చంపిన వ్యక్తుల రిమాండ్

MNCL: కవ్వాల్ అభయారణ్యంలో చిరుత పులిని హతమార్చిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించామని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మ రావు తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ముడితె వెంకటేష్ క్లచ్ వైర్‌తో ఉచ్చును ఏర్పాటు చేయగా చిరుత పులి చిక్కుకొని మృతి చెందిందన్నారు. ఆయనకు ముడితె శ్రీనివాస్, వనపర్తి శ్రీకాంత్ సహకరించారని వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించామన్నారు.