VIDEO: 20 కేజీల గంజాయి పట్టివేత

VIDEO: 20 కేజీల గంజాయి పట్టివేత

SKLM: నరసన్నపేట మండలంలోని మడపాం టోల్ గేట్ వద్ద ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు నిన్న రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. కాగా ఈ  తనిఖీలలో అనుమానస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ శ్రీనివాసరావు తన కార్యాలయంలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి, వివరాలను వెల్లడించారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.