డ్రంక్ అండ్ డ్రైవ్.. ఐదుగురిపై కేసులు నమోదు: ఎస్సై
KMR: దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా దేవునిపల్లి ఎస్సై రంజిత్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఇది సమాజానికి పెను ప్రమాదమని హెచ్చరించారు.