అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు

అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు

కృష్ణా: జిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మచిలీపట్నంలోని లక్ష్మీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బీఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.