బైపాస్ రోడ్డు నిర్మాణంపై ఉద్రిక్తత

బైపాస్ రోడ్డు నిర్మాణంపై ఉద్రిక్తత

తూ.గో: మామిడికుదురు మండలం కైకాలపేటలో మంగళవారం బైపాస్ రోడ్డు నిర్మాణంపై తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణంకి భూమి ఇచ్చిన వారు గజాలు లెక్కన పరిహారం ఇవ్వాలని కోరగా సెంట్లు లెక్కన పరిహారం ఇచ్చేందుకు అధికారులు సిద్ధపడ్డారు. అయితే మంగళవారం పోలీసు బందోబస్తుతో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించగా నిర్వాసితులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.