నూతన వైద్యాధికారిగా డాక్టర్ యశ్వంత్

SRPT: మోతె మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన వైద్యాధికారిగా డాక్టర్ యశ్వంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. లింగగిరి నుంచి బదిలీపై వచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన డాక్టర్ ధరావత్ రాజేష్ పెన్ పహాడ్ మండలానికి బదిలీ అయ్యారు. డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.