VIDEO: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన వృద్ధురాలు

ADB: రిమ్స్ ఆస్పత్రిలోని లిఫ్ట్‌లో ఓ వృద్ధురాలు శనివారం ఇరుక్కు పోయింది. ఆస్పత్రికి వచ్చిన వృద్ధురాలు పై అంతస్తుకు వెళ్లే క్రమంలో లిఫ్ట్ ఒక్కసారి ఆగిపోయింది. దీంతో ఆందోళనకు గురైంది. ఆమెతో పాటు లిఫ్టులో ఉన్న వారి సహకారంతో సెక్యూరిటీ గార్డు సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికులు, సెక్యూరిటీ గార్డ్ సిబ్బంది వృద్ధురాలిని క్షేమంగా బయటకు తీశారు.