డ్రోన్ సహాయంతో అసాంఘిక కార్యక్రమాలకి చెక్

డ్రోన్ సహాయంతో అసాంఘిక కార్యక్రమాలకి చెక్

ELR: నూజివీడు రూరల్ మర్రికుంట, జంగంగూడెం అటవీ ప్రాంతంలో డ్రోన్ ద్వారా పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డ్రోన్ కెమెరా సహాయంతో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ నాటు సారా తయారీ, మరియు ఇతర చట్ట విరుద్ధ చర్యలపై గట్టి పర్యవేక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై జ్యోతి బసు మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం మారుమూల ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నామన్నారు.