'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొన తంగిరాల

NTR: నందిగామ మండలం, కేతవీరునిపాడులో రైతుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులతో కలిసి పాల్గొన్నారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముక వంటివారని అన్నారు. రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, ఉత్పాదకతను పెంచడానికి దోహదపడనున్నదని అన్నారు.